కమల్ హసన్ నటించిన సినిమాల్లో నటుడు పొన్నంబళమ్ విలన్ గా నటించి మెప్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బావుండక చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్సీ సమస్యలతో బాధపడుతున్న పొన్నంబళమ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆ విషయం తెలుసుకున్న కమల్ అతడికి ఆర్ధిక సాయం చేస్తానని మాట ఇచ్చారు. అతడి పిల్లల చదువు ఖర్చులను కూడా తానే భరిస్తానని అన్నారు. కాగా, కమల్ తో కలిసి పొన్నంబళమ్ అపూర్వ సాగోధరార్గల్, మైకేల్ మదన కామరాజన్ చిత్రాల్లో నటించారు. రజనీకాంత్ తో కలిసి ముత్తు, అరుణాచలం చిత్రాల్లోనూ, అజిత్ తో అమర్కలమ్, విక్రమ్ నటించిన సామి చిత్రంలోనూ పొన్నంబళమ్ నటించారు. తన ఆరోగ్య పరిస్థితిని ఓ వీడియోలో వివరించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉండి చికిత్స పొందుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments