కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ భేటీ అయ్యారు. ఈ సంధర్భంగా కీలక అంశాలపై అరగంట పాటు సాగిన సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ..ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి నిధులు, జిఎస్టి పన్నుల వాటా విడుదల చేయాలని కోరినట్టు తెలిపారు. “కరోనా” వల్ల రాష్ట్రం పై ఆర్థికంగా ప్రభావం పడిందని.. 40 శాతం రాష్ట్రానికి రాబడి తగ్గిపోయిందని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ముఖ్యమంత్రి ప్రతి అంశంపై వివరణ ఇస్తూ ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర ఆర్ధికమంత్రికి వివరించి అందజేశామన్నారు. రాష్ట్రానికి మామూలుగా రావాల్సిన నిధులతోపాటు అదనంగా సహకారం అందించాలని ఆర్ధిక మంత్రిని కోరినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,500 కోట్ల నిదులు విడుదల చేయాలని కోరామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ నిధులు సహా, పెండింగ్ నిధులు వస్తే రాష్ట్ర పథకాలకు నిధులను కేటాయించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. జిఎస్టి బకాయిలు, నిధులు కూడా రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్ బిల్లుల నిధుల విడుదలకి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తానని తెలిపారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను కూడా కలుస్తానని అన్నారు.కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో జనాభా ప్రాతిపదికన రాష్ట్రానికి నిధులు రావాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్ధిక శాఖ కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ కల్లమ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, నీటి పారుదల శాఖ కార్యదర్శి పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments