ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా’దొరసాని’ చిత్రంతో అరంగేట్రంలోనే తొలి హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన తెలంగాణ నేపథ్యంలోని అందమైన ప్రేమ కథకు ప్రేక్షకుల నుండి మంచి స్పాండనే వచ్చింది . ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ‘దొరసాని’.. శివాత్మిక రాజశేఖర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆనంద్ తాజాగా తన రెండో సినిమాని ప్రకటించాడు. భవ్య క్రియేషన్స్ బేనర్‌లో ఆనంద్ తన రెండో సినిమా చేయనున్నాడు. కొద్ది సేపటి క్రితం దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, ఈ మూవీని వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడు. బిగిల్ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments