వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘కరోనా వైరస్’, ‘మర్డర్’, ‘కిడ్నాప్ అఫ్ కత్రినా కైఫ్’ సినిమాలను తెరకెక్కిస్తున్న వర్మ.. ‘పవర్ స్టార్’ సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పవర్ స్టార్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసిన వర్మ అందులో అభ్యంతరకర అంశాలు జోడించాడు. ఆ టైటిల్లోగోలో టీ గ్లాసు ఉండడం ఆసక్తి రేపుతోంది. వర్మ మాత్రం ఇది ఎవరిని ఉద్దేశించి తీస్తున్న సినిమా కాదని ప్రకటించాడు. కానీ ఈ సినిమా ఓ వ్యక్తికి, ఓ వర్గానికి బాగా కోపం తెప్పిస్తుంది. ఇక వర్మ ఈరోజు పవర్ స్టార్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నానని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ లుక్ ఎన్ని వివాదాలను తెస్తుందో చూడాలి.
పవర్ స్టార్’ సినిమా ఆసక్తికరమైన అప్డేట్..
Subscribe
Login
0 Comments