నేడు వైఎస్‌ఆర్‌ 71వ జయంతి.. జరగబోయే కార్యక్రమాలు ఇవే..!

504

నేడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి. ఈ సందర్భంగా ఉదయం 8.10 గంటలకు సీఎం జగన్ తన కుటుంబ సభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌ దగ్గర తన తండ్రికి నివాళులు అర్పిస్తారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈ కార్యక్రమం సాదాసీదాగా నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో సీఎం కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఇదిలా ఉండగా, వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 9.15 గంటలకు మహానేతకు ఘనంగా నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా పలువురు సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here