విపక్షాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. కొత్త సచివాలయం నిర్మాణంపై కాంగ్రెస్ బీజేపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారని అన్నారు. సచివాలయంలోకి ఫైర్ ఇంజన్ కూడా పోలేని పరిస్థితి ఉందని, క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రస్తుత సచివాలయంలో చాలా సార్లు అగ్ని ప్రమాదలు జరిగాయని గుర్తుచేశారు. ఫైర్ యాక్సిడెంట్ లు జరిగి ఉద్యోగులు చనిపోవాలా ? అని ప్రశ్నించారు. కోర్టును ధిక్కరించి విపక్షాలు మాట్లాడుతున్నాయని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు ని సీటు కాపాడుకో..తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావు. బిల్డింగ్‌లు అప్పగించి ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆంధ్ర వారిలా మీరు సెక్షన్ 8 అంటారా?, సెక్షన్ 8 అంటే నాలుక కోస్తారు. అని వ్యాఖ్యానించారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధిస్తే..సెక్షన్ 8 అంటూ ఆంధ్ర పాట పడుతారా అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదు …తెలంగాణ సొత్తు..అంటూ ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్ నాయకులు నీచంగా వ్యవహరిస్తున్నారని, ఆంధ్ర నాయకులను కాంగ్రెస్ నాయకులు ఉసిగొల్పుతున్నారని కామెంట్ చేసారు. హైదరాబాద్ తెలంగాణదే.. మీ వల్లే 7 మండలాలు ఆంధ్రలో కలిసాయని అన్నారు. సచివాలయం గురించి మాట్లాడితే భరిస్తాం… కానీ సెక్షన్ 8 అంటే ఊరుకోమని ఫైర్ అయ్యారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments