దివంగత నేత YS సతీమణి విజయమ్మ రాసిన నాతో వైఎస్సార్‌ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించారు ఏపీ సీఎం జగన్. YSR సహధర్మచారిణిగా శ్రీమతి విజయమ్మ 37 ఏళ్ల జీవిత సారం ఈ పుస్తకమని… అలాగే మహానేత మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాలు కూడా ఇందులో పొందుపరిచినట్టు ఆయన తెలిపారు. డాక్టర్‌ వైయస్సార్‌ నిజ జీవితంలో వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో… ఉన్నది ఉన్నట్టుగా శ్రీమతి విజయమ్మ ఇందులో వివరించారు.

ఆయన తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా… ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామన్నది విజయమ్మ మాట. బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం.. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన సుదీర్ఘ ప్రయాణంలో చూసిన విధానాన్ని పుక్తకరూపంలో తీసుకొచ్చారని.. ఇది ఒక మంచి పుస్తకం అన్నారు. ‘నాన్న జయంతి రోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అన్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంలో జగన్ తన తల్లి విజయమ్మను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments