ఆ క్షణం లో నా రక్తం మరిగిపోయింది

616

తెలుగు వాళ్లందరికీ సూపరిచితమైన పేరు భయ్యా సన్నీ యాదవ్. ఒక సూపర్ స్టార్ కు ఏమాత్రం తగ్గని క్రేజ్ ఈయన సొంతం . ఈయన రైడింగ్ వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు . దాదాపు 5 లక్షల మంది ఫాలోయర్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్నారు సన్నీ . ఈయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ ఇంటర్వ్యూ లో తనకు రైడింగ్ లో ఎదురైన సంఘటనలను పంచుకున్నారు . ఈ సందర్భంగా తనకు ఎంతో కోపం తెప్పించిన సంఘటన ఒకటి తెలిపారు . ఆయన లడక్ రైడ్ లో ఉండగా శ్రీనగర్ ప్రజల ప్రవర్తన చూసి చాలా షాక్ అయ్యానని,అక్కడ భారతదేశం కంటే పాకిస్తాన్ పై ఎక్కువ ప్రేమ చూపిస్తారని, అది ఎంతవరకంటే ఇండియా జెండా కనిపిస్తే చింపేవారకూ వదలరని,తాము ఎంత వెతికినా భారత దేశ జాతీయ జెండా దొరకాకపోగా పాకిస్థాన్ జెండా ఒకటికి రెండు ఫ్రీ గా ఇస్తామన్నారని,ఆ సమయంలో తనకు చాలా కోపం వచ్చిందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here