అజయ్‌దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైదాన్‌’. ఫుట్‌బాల్‌కి స్వర్ణయుగమైన 1952-62 మధ్య కాలానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2021 ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్టు ట్విటర్‌ ద్వారా ప్రకటించారు అజయ్‌దేవగణ్‌. ”ఇప్పటి వరకూ తెరపై చూడనిది..ప్రతి భారతీయుడు గర్వపడే కథ ఇది. ఆగస్టు 13వ తేదీని గుర్తుపెట్టుకోండి”అని ట్వీటారు అజయ్‌. ‘బదాయి హో’ దర్శకుడు అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

గాల్వాన్‌లోయ ఘటనతో…

ఇటీవల గాల్వాన్‌లోయ టనలో చైనా సైనికులతో పోరాడిన భారత వీర జవాన్ల కథ వెండితెరకు రాబోతుంది. అజయ్‌దేవగణ్‌ నిర్మించనున్న ఈ చిత్రాన్ని వీరమరణం పొందిన భారతీయ జవాన్లకు అంకితం ఇవ్వబోతున్నారు. నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు ప్రకటించాల్సి ఉంది. అజయ్‌ ప్రస్తుతం ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఓ దేశభక్తి చిత్రంలో నటిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments