హోం క్వారంటైన్లో ఉన్న రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్‌ను మరిం త మెరుగైన వైద్యసేవల కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. పద్మారావుతోపాటు నలుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా హోంక్వారంటైన్లో ఉన్న ఆయనను శుక్రవారం అపోలో ఆస్పత్రికి తరలించి ప్రత్యేకగదిలో వైద్యం అందిస్తున్నారు. కాగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావును సీఎం కేసీఆర్ శుక్రవారం ఫోన్ ద్వారా పరామర్శించారు.
అపోలోకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్
Subscribe
Login
0 Comments