తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 18 వేలు దాటిపోయింది.  కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.  ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో తెలంగాణలో రికార్డ్ స్థాయిలో 1213 కొత్త కేసులు నమోదయ్యాయి.  ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి.  దీంతో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18570కి చేరింది.  ఇందులో 9226 కేసులు యాక్టివ్ గా  ఉండగా, 9069 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

ఇకపోతే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా కారణంగా 8 మంది మృతి చెందారు.  దీంతో మొత్తం మరణాల సంఖ్య 275కి చేరింది.     నమోదైన 1213 కొత్త కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలోనే 998 కేసులు ఉండటం విశేషం.  జీహెచ్ఎంసి పరిధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5356 కరోనా టెస్టులు నిర్వహించారు.  దీంతో ఇప్పటి వరకు తెలంగాణ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 98,153కి చేరింది.  

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments