ఏపీలో ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో కాళీ అయ్యిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు  తెలుస్తోంది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. కాగా శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభం అవుతుండగా… 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కాబట్టి కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ఎంపిక చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments