హైదరాబాద్ ఫార్మా సిటీ పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఫార్మా సిటీ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతోందన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాధాన్యం, అవసరం మరింత పెరిగిందని తెలిపారు. కరోనాకు మందుతో పాటు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే రాబోతోందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అత్యుత్తమ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ ఫార్మా సిటీ పురోగతిపై కేటీఆర్ సమీక్ష
Subscribe
Login
0 Comments