కేంద్ర ప్రభుత్వం సడెన్‌గా 59 చైనా యాప్స్‌ని నిషేధించినా దేశ ప్రజలెవ్వరూ వ్యతిరేకించట్లేదు. తమకు ఆ యాప్స్ లేకపోయినా పర్వాలేదంటున్నారు. ఐతే… చైనా యాప్స్ చేసే పనిని చేసేందుకు ఇంకా చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్నాళ్లూ వాటిని మనం పట్టించుకోలేదు. ఇప్పుడు బ్యాన్ విధించడంతో… కొత్త యాప్స్ వైపు దృష్టి సారిస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే… కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యాప్స్‌ని మన మొబైళ్ల నుంచి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వాటి బదులుగా… కొత్తవి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మరి నిషేధించిన యాప్స్ చేసే పనిని ఏ యాప్స్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రౌజింగ్ : ఇన్నాళ్లూ మీరు బ్రౌజింగ్ కోసం… యూసీ బ్రౌజర్ వాడుతున్నట్లైతే… ఇకపై అది ఉండదు కాబట్టి… దాని బదులు గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా వంటివి వాడొచ్చు.సెక్యూరిటీ : మొబైల్‌లో వైరస్ చేరకుండా… అవాస్తా, ఏవీజీ, నార్తన్‌ యాంటీ వైరస్‌ వంటి యాప్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఫైల్స్‌ షేరింగ్ : షేర్‌ఇట్‌ బదులుగా షేర్‌ ఫైల్స్‌, ఫైల్స్‌ బై వంటి యాప్స్ వాడొచ్చు.

ఫొటో ఎడిటింగ్ : అడోబ్ ఫొటోషాప్, గూగుల్ స్నాప్‌సీడ్, పిక్స్ ఆర్ట్, లైట్ రూమ్, బీ612 వంటి వాటితో చక్కగా ఫొటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు.

స్కాన్‌ : ఫొటోలు, ఫైళ్లను స్కాన్ చేసేందుకు ఇప్పుడు డాక్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, డాక్యుమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్, అడోబ్ స్కాన్, ఫొటో స్కాన్ బై గూగుల్, మైక్రోసాఫ్ట్ లెన్స్ వంటివి వాడొచ్చు.

వీడియో ఎడిటింగ్ : వీడియోలను ఎడిట్ చెయ్యడానికి చాలా ఆప్షన్లున్నాయి. అడోబ్‌ ప్రిమియర్‌ క్లిప్‌, మ్యాజిస్టో, కైన్‌ మాస్టర్‌ యాప్స్‌ బాగా ఉపయోగపడతాయి.వీడియో షేరింగ్‌ : టిక్‌టాక్ బదులుగా… రోపోసో, డబ్‌ స్మాష్‌, పెరిస్కోప్‌, యూట్యూబ్ లాంటి వాటిని వాడొచ్చు.

రెండు అకౌంట్లు : ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు అకౌంట్లతో యాప్‌లను వాడాలంటే క్లోన్‌ యాప్‌, సూపర్‌ క్లోన్‌ వంటివి యాప్స్‌ ఉపయోగపడుతున్నాయి.

మొబైల్ లాక్‌ : ఇందుకు చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. లాక్‌ యాప్‌ – స్మార్ట్‌ యాప్‌ లాకర్, లాక్‌ యాప్‌ – ఫింగర్‌ప్రింట్‌, కీప్‌ సేఫ్‌, నొర్టన్‌ యాప్‌ లాక్‌, లాక్‌ మై పిక్స్‌ సీక్రెట్‌ ఫొటో వాల్ట్‌ వంటివి వాడితే… చైనాకి చెక్ పెట్టినట్లే.

వీడియో కాన్ఫరెన్స్‌ : ప్రస్తుతం అందరూ వాడుతున్న జూమ్‌పై కేంద్రం నిషేధం విధించకపోయినా… దానికి ఆల్టర్నేట్‌గా గూగుల్‌ మీట్‌, స్కైప్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ డుయో, వాట్సాప్‌ కాల్‌, సే నమస్తే వంటి యాప్స్ వాడుకోవచ్చు.

టైపింగ్ : డీఫాల్ట్ టైపింగ్ కీబోర్డు నచ్చకపోతే… గూగుల్‌ ఇండిక్‌ కీబోర్డు , జీ బోర్డ్‌, గింగర్‌ కీబోర్డు, మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌ కీబోర్డు వంటివి ట్రై చెయ్యవచ్చు.

ఆఫీస్ వర్క్ : వర్డ్ ఎక్సెల్ షీట్ల వంటి వాటి కోసం మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, ఓన్లీ ఆఫీస్‌ వంటివి వాడొచ్చు.

పైన చెప్పిన యాప్స్ చాలా కాలం నుంచి ఉన్నా… ఎక్కువ మంది వాడకపోవడం వల్ల అవి ఫేమస్ కాలేదు. ఇప్పుడు చైనా యాప్స్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది కాబట్టి… ఇక ఈ యాప్స్‌కి డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments