ప్రధాని నరేంద్రమోడీ నేటి సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, చైనాకు చెందిన 59 యాప్‌లపై ప్రభుత్వం నిన్న రాత్రి నిషేధం విధించింది. అలాగే, నేటి ఉదయం భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, నేటితో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు సంబంధించి మోడీ మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments