తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద ఇకపై తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహిం చాలని. తిరుమలలో విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులకు కూడా పరీక్షలు చేపట్టాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌లో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, తిరుమల అదనపు ఈఓ ధర్మారెడ్డి, తిరుపతి జెఈఓ పి.బసంత్‌కుమార్‌, ముఖ్యనిఘా,భద్రతాధికారి గోపీనాధ్‌జెట్టి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అలిపిరి వద్ద పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ పరీక్షా ఫలితాలు 24 గంటల్లో వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భరత్‌గుప్తాను అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ కోరారు. తిరుమలలో పనిచేసే టీటీడీ ఉద్యోగుల నుంచి రోజుకు 100 శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేపట్టాలన్నారు. ఆ పరీక్షల ఫలితాలు 24 గంటల్లోగానే వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భరత్‌గుప్తాను కోరారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులను వారంరోజులపాటు ఒకే చోట పనిచేసేలా డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని సెంట్రల్‌ ఆసుపత్రిలో ఉద్యోగుల కోసం వెంటిలెెటర్లు ఏర్పాటు చేయాలన్నారు.

పరిస్థితిని బట్టి బర్డ్‌ ఆసుపత్రిని కరోనా రోగుల చికిత్సకు వినియోగించేవిషయంపై వారంరోజుల్లోగా నిర్ణయం తీసుకోనున్నామని అనిల్‌కుమార్‌ సిం ఘాల్‌ తెలిపారు. టీటీడీ ఉద్యోగుల క్వారంటైన్‌కోసం మాధవం వసతిసముదాయాన్ని వినియోగించుకోడానికి ఏర్పాట్లు చేయాలని, వీటికి అవసరమైతే ఒక డిప్యూటి ఈఓను, ఇద్దరు ఎఈఓలతో ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, అవసరమైన వైద్యపరికరాలను సిద్ధంచేయాల ని జెఈఓ బసంత్‌కుమార్‌కు నిర్దేశించారు. శ్రీనివాసం వసతి సముదాయాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ పెంచలయ్య, డిప్యూటి కలెక్టర్‌ శ్రీనివాస్‌, టిటిడి ఆరోగ్యాధికారి డాక్టర్‌ ఆర్‌.ఆర్‌.రెడ్డి కూడా పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments