కామెడీ పాత్రలతో పాటు విలక్షణ పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న అల్లరి నరేష్ త్వరలో నాంది అనే చిత్రంతో అభిమానులని పలకరించనున్నాడు. ఈ చిత్రం నరేష్ కెరియర్‌లో 57వ చిత్రంగా రూపొందుతుండగా, ఇటీవల చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. ఇందులో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని ఉన్నాడు. ఇక ఈ రోజు నరేష్ బర్త్‌డే కావడంతో ‘నాంది’ ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరట గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు విజయ్ దేవరకొండ. ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది.

నాంది చిత్రంతో హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈచిత్రానికి అబ్బూరి రవి, చోటా కె. ప్రసాద్‌, శ్రీచరణ్ పాకాల, బ్రహ్మ కడలి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, హరీష్ ఉత్తమన్‌, ప్రియదర్శి, ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.వినూత్న కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments