సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత చాలా మంది చాలామంది ప్రముఖులు నెపొటిజమ్ గురించి మాట్లాడుతున్నారు. టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు ఇవ్వడం లేదని చాలా మంది తమ అభిప్రాయాలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు ఇది టాలీవుడ్‌లోనే ఉండేవన్న వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఈ విషయంలో బాలీవుడ్ మించిపోయింది అంటున్నారు. ఈ విషయంపై యంగ్ హీరో నిఖిల్ సంచలన కామెంట్లు చేశారు.

ఇండస్ట్రీ అన్న తర్వాత కచ్చితంగా నెపొటిజమ్ అనేది ఉంటుందని కుండ బద్ధలు కొట్టేశాడు నిఖిల్. ఒక్క సినిమా అనే కాదు ఇలాంటి సమస్యలు అన్ని ఫీల్డ్‌లోనూ ఉంటుందని తేల్చి చెప్పేశారు. నిజం చెప్పాలంటే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌లేని వాళ్లు సినీ ఇండస్ట్రీలో ఎదుగుతుంటే వారిని అనిచివేయడానికి చూస్తుంటారు. అలాంటప్పుడు మరింత స్ట్రాంగ్ అవ్వాలి కానీ, ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఎన్నిసమస్యలు వచ్చిన పోరాడి నిలబడాలి అదే జీవితం అంటున్నారు నిఖిల్‌.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments