ఈ మధ్య జరిపిన ఓ సర్వే ప్రకారం… మన దేశంలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ మందికి ఉందట. అందుకు సవాలక్ష కారణాల్ని చెప్పారు. అవి పక్కన పెడితే… మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కరోనాకి ఇప్పుడు మందులు వచ్చేసినా… అవి పూర్తిగా కరోనాను పోగొట్టలేవు. మన వంతుగా మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. అందుకు ఏం తినాలో, ఏం తినకూడదో ఏపీ ప్రభుత్వం ఓ లిస్టు రెడీ చేసి ఇచ్చింది. దాన్ని ఓసారి చూస్తే… అప్పుడు మనం మరింత జాగ్రత్త పడి… ఆరోగ్యాన్ని పెంచేసుకోవచ్చు. ఆ లిస్ట్ ఏంటంటే…

– బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్, చిరుధాన్యాలు వంటివి తినండి
– బీన్స్, చిక్కుడు, పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు. – ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్, వంకాయ వంటి వాటిని చేర్చండి
– రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని తాగండి
– పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే సి విటమిన్ ఉంటుంది. తద్వారా కరోనా సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది- ఆహారంలో అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
– ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. కొవ్వు పదార్థాలు, నూనెలను తక్కువగా తినండి.
– పండ్లను, కూరగాయలను తినడానికి ముందు శుభ్రంగా కడగండి
– వెన్న తీసిన పాలు, పెరుగును తీసుకోండి. వీటిలో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

– మైదా, వేపుళ్ళు, జంక్ ఫుడ్ (చిప్స్, కుక్కీస్) తినకండి.
– శీతల పానీయాలు, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకండి – వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.
– చీజ్, కొబ్బరి, పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి.

– మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచకండి.
– స్కిన్ చికెన్, చేపలు, గుడ్డులో తెల్లసొన వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోండి.

తినకూడనివి :
– మాంసం, లివర్, వేపిన మాంసాన్ని తినకండి.
– వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోండి.
– పూర్తి గుడ్డును (పచ్చసొనతో కలిపి) వారంలో ఒక్కసారి మాత్రమే తీసుకోండి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments