సూర్య‌గ్ర‌హణం కార‌ణంగా ఆదివారం తిరుమ‌ల‌లోని శ్రీవారి ఆల‌యం మూత‌ప‌డ‌నుంది.. శనివారం రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవ అనంతరం శ్రీవారి ఆలయాన్ని మూసివేయ‌నున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు.. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంద‌ని.. ఈ నేప‌థ్యంలో.. ఆదివారం మ‌ధ్యాహ్నం.. గ్రహణం వీడిన తర్వాత 2.30 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు.. అనంతరం రోజువారి కైంకర్యాలు నిర్వహించి రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తామని, కైంకర్యాల నిర్వహణలో భాగంగా రేపు భక్తులకు దర్శనం ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments