నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

679

మార్చి నెలలో జరిగిన తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడం వల్ల మూల్యాంకనం ఆలస్యంగా ప్రారంభం కావడంతో సాధారణంగా ఏప్రిల్ నెలలో విడుదలయ్యే ఫలితాలు జూన్ లో విడుదలవుతున్నాయి.

https://tsbie.cgg.gov.in/, https://manabadi.co.in/, https://schools9.com/ వెబ్ సైట్లలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు మార్చి 23 వరకు జరిగాయి. 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గూగుల్ ప్లే స్టోర్‌లో tsbie m-services అనే యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని కూడా ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here