పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సమర్పిస్తున్నారు. బాలీవుడ్ లో సంచలన విజయం అందుకున్న పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్ ని నిర్మిస్తుండగా అటు బాలీవుడ్…కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచి 100 కోట్లు వసూళ్ళు రాబట్టడంతో ఇప్పుడు తెలుగులోను అదే ధీమాతో యూనిట్ సభ్యులు ఉన్నారు.

ఇక దాదాపు 80 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మొత్తంగా నెల రోజుల కి మించి వర్క్ లేదని దర్శకుడు వేణు శ్రీరాం ఇంతక ముందే వెళ్ళడించాడు. ఇటీవల సినిమా షూటింగ్స్ కి పర్మిషన్స్ రావడంతో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో కోర్ట్ సెట్ ని ఇప్పటికే సిద్దం చేసి ఉంచారు. అయితే పవన్ కళ్యాణ్ ఆగస్టు నుంచి షూటింగ్ లో పాల్గొంటానని చెప్పడంతో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ వంటి ముఖ్య తారాగణంతో కోర్ట్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దిల్ రాజు, దర్శకుడు సిద్దమవుతున్నారు.

అయితే ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ ని జాయిన్ చేయాలని తన మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించాలని దిల్ రాజు సంప్రదించారట. వాస్తవంగా శృతిహాసన్ వకీల్ సాబ్ లో నటిస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చినప్పటికి శృతిహాసన్ స్వయంగా ఈ సినిమా గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనంటూ క్లారిటి ఇచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి శృతిహాసన్ పేరు ప్రస్తావనలోకి రావడం ముఖ్యంగా ఈ సినిమాలో నటించేందుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందన్న వార్తలు రావడంతో శృతిహాసన్ స్పందించినట్టు తెలుస్తుంది.

రెమ్యూనరేషన్ పరంగా తను ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదని సన్నిహిత వర్గాల దగ్గర చర్చించినట్టు సమాచారం. అయితే అసలు నిజంగా శృతిహాసన్ వకీల్ సాబ్ లో నటిస్తుందా అన్నది అటు మేకర్స్ నుంచి గాని ఇటు శృతిహాసన్ నుంచి గాని క్లారిటి రాలేదు. ఇక వకీల్ సాబ్ లో చేస్తే మాత్రం శృతిహాసన్ పవన్ కళ్యాణ్ ల హ్యాట్రిక్ సినిమా అవుతుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు చేసిన సంగతి తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments