ఆయన నివాసానికి భారీగా తరలివచ్చిన నేతలు, అభిమానులుసూర్యాపేట చేరుకున్న అమరవీరుడి పార్థివదేహంనేడు అంత్యక్రియలుభారత్-చైనా సరిహద్దు లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబుకు జనం జోహార్లు అర్పించారు.కొన్నిచోట్ల కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. సంతోష్ బాబు మరణవార్త తెలుసుకున్న నేతలు, అభిమానులు బంధువులు బుధవారం పెద ఎత్తున తరలి వచ్చారు.. సంతోష్ బాబు అమర్ రహే, భారత మాతాకీ జై అనే నినాదాలతో సూర్యాపేట మార్మోగింది కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల, సంతోష్ బాబు సతీమణి సంతోషి చిన్నారులను చూసుకుంటూ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ విలపించడంతో ఆ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది.వీరుడా.. వందనం
సంతోష్ చిత్రపటాలతో ర్యాలీలు
Subscribe
Login
0 Comments