ఏపీ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు గురువారం సాయంత్రం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నారు. వైసీపీ పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, అరెస్టులు, దళితులపై దాడులు, దౌర్జన్యాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు, 4 రోజుల్లో ముగ్గురు బీసీ మాజీ మంత్రులపై తప్పుడు కేసులతో పాటు వైసీపీ నేతల అవినీతి కుంభకోణాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.
నేడు గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
Subscribe
Login
0 Comments