ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి.. రోజుకో కొత్త రికార్డు తరహాలో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. 24 గంటల్లో 15,188 టెస్టులు చేయగా.. 351 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.. వీరిలో స్థానికులు 275 మంది కాగా.. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 76 మంది ఉన్నారు.. మరోవైపు ఇద్దరు మరణించారు.. తాజా కేసులతో… రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.555కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు కరోనా బారినపడి 2,906 మంది కోలుకున్నారు. ప్రస్తుతం స్థానికులే 2559 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 90కి పెరిగింది. ఏపీలో మొత్తం కేసులు తీసుకుంటే మాత్రం 7 వేలు దాటింది.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.. 7071కి చేరింది.