బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఆ సినిమాతో ప్రభాస్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది. తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్సకత్వంలో ‘సాహో’ అనే చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయింది. ఈ సినిమా తోలి రోజు ఆట నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాదించింది. కేవలం బాలీవుడ్ లోనే ఈ చిత్రం సుమారు రూ. 200 కోట్ల భరీ వసూళ్లను సాధించి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది.

‘సాహో’ తరువాత ప్రభాస్ ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలోపీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. తరువాత ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రానికి సంబంధించి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దేశం మొత్తం గుర్తు పట్టే హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడని తెస్లుస్తుంది. అయితే, ఇప్పటికే అలియా భట్ ను సంప్రదించగా.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున అలియా భట్ సున్నితంగా తిరస్కరించింది. ఆ తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ దీపికాను సంప్రదించగా ఆమె ముందుగా ఎటువంటి సమాదానం ఇవ్వలేదు. ప్రస్తుతం దీపిక రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ’83’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రభాస్ సరసన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమా చేయడానికి ఎట్టకేలకు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు దీపిక చెప్పిన కండిషన్స్ చూసి నిర్మాతలు కమ్ముతున్నాయి. అదేమిటంటే.. నాకు ఈ చిత్రంలో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. కనీ.. ఈ చిత్రం బాలీవుడ్(హిందీ) థియేట్రికల్ రైట్స్ ఇవ్వమని కోరినట్టు సమాచారం. ప్రభాస్ చేసిన ‘సాహు’ సినిమా కి నెగటివ్ టాక్ వచినా.. మొత్తం గా సుమారు రూ. 200 కోట్ల వరకు గ్రాస్ ను సాదించింది. మరి దీపిక చెప్పిన షరతులకు నిర్మాత ఓకే చెపుతారా? లేదా? అనేది వేచి చూడాలి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments