సరిహద్దుల్లో చైనా సైన్యం చేస్తున్న దాష్టీకాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం స్పందించారు. దేశ రక్షణ కోసం అమరులైన 20 మంది జవాన్ల వీరత్వం ఏమాత్రం వృథా పోదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ ఎప్పటికీ శాంతినే కోరుకుంటోందని, అయితే రెచ్చగొడితే మాత్రం సరైన, దీటైన జవాబు చెప్పడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. తమకు దేశ ఐక్యత, సార్వభౌమత్వం చాలా ముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. చైనా సైనికులతో సరిహద్దుల్లో పోరాడుతూ వీర మరణం పొందిన సైనికులను చూసి దేశం ఎంతో గర్విస్తోందని మోదీ అన్నారు.
చైనాకు ప్రధాని మోదీ వార్నింగ్
Subscribe
Login
0 Comments