కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా సినిమా, సీరియల్, ఎంటటైర్మెంట్ షోల షూటింగ్లు నిలిచిపోయాయి. అయితే ఇటీవల సినిమా చిత్రీకరణకు రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంలో తిరిగి షూటింగ్లు ప్రారంభమయ్యాయి. తాజాగా బుల్లితెర సుపర్హిట్ కామెడీ షో జబర్దస్త్ షూటింగ్ సైతం ప్రారంభమైయింది. ఇది జబర్దస్త్ అభిమానులకు గుడ్ న్యూసే.
రామానాయుడు స్టూడియోలో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తయినట్లు సమాచారం. తర్వలోనే ఎడిటింగ్ పూర్తి చేసి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు నిర్వాహకులు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నామని చెబుతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ మల్లెమాల ఎంటటైర్మెంట్స్.