ఈనెల 21న సూర్య గ్రహణం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేయనున్నారు. 20న రాత్రి యధావిధిగా ఆలయం మూసివేసి 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ, శుద్ధి చేయనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 21న సూర్య గ్రహణం సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్ రావు తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments