ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు తన సినిమాలకు నిజ జీవితానికి సంబందించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ వారికి మరింత దగ్గరవుతున్నారు. తాజాగా చిరు ట్విట్టర్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గతంలో తాను రక్తదానం చేసిన వీడియోలను ఆయన ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. “ఒకరి జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఏముంటుంది. ఎక్కడైనా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు, ప్రజలు రక్తదానం చేస్తున్నారని తెలుసుకున్న ప్రతిసారి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతాను, రక్తదానం చేసే శక్తిని ఆయనే ఇచ్చాడు” అంటూ మెగాస్టార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా చిరు ఎంతో మందికి అత్యవసర సమయాల్లో అండగా నిలిచారు. ఇటీవల లాక్ డౌన్ సమయం లోను ఆయన రక్తదానం చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.
చిరు ఎమోషనల్ పోస్ట్..
Subscribe
Login
0 Comments