కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపుల వల్ల సినిమా షూటింగులు ప్రారంభం అయినా, థియేటర్లు ప్రారంభం కాకపోవడంతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు ఆర్థికంగా చితికిపోతున్నారు. దీనికి తోడు కరెంట్ బిల్లులు వారికి అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.సోషల్ మెసేజ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పైగా పూర్తి చేసుకుంది. అయితే, లాక్ డౌన్ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పరిస్థితులు సర్దుకున్న తరువాత థియేటర్లు తెరచినా, ప్రేక్షకులు వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. భారీ బడ్జెట్ తో చిత్ర నిర్మాణం జరిపితే, ప్రస్తుత పరిస్థితులలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ట్రేడ్ వర్గాలే అంచనా వేయలేక పోతున్నాయి.ప్రస్తుతం వున్న పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ తగ్గింపుపై ఆలోచన చేస్తున్నారు. దీంతో ‘ఆచార్య’ చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం బడ్జెట్టును కొంతవరకు తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది.

తగ్గించిన బడ్జెట్ మేరకు కథలో మార్పులు చేస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సినిమా షూటింగ్స్ విషయంలో ఆర్థిక క్రమశిక్షణ, కరోనా జాగ్రత్తలు తీసుకుని సాధ్యమయినంత త్వరగా షూటింగ్ పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా నిర్మాతపై అదనపు భారం పడకుండా చూడాలనుకుంటున్నారు. మెగాస్టార్ బాటలో మిగిలిన సినిమా యూనిట్లు నడిస్తే కరోనా నుంచి కొంతకోలుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments