మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా దాదాపు పదిహేనేళ్ల కెరీర్ పూర్తి చేసింది. ఇన్నేళ్లలో ఏనాడూ తమ్మూ ఫలానా హీరోతో డేటింగ్ చేసినట్టు గాసిప్పు అయినా లేదు. గత నాలుగైదేళ్లలో మాత్రం తనపై అడపాదడపా ఎఫైర్ గాసిప్స్ షికారు చేశాయి. నయనతారకు బ్రేకప్ చెప్పేసిన ప్రభుదేవాతో వరుసగా రెండు మూడు సినిమాల్లో నటించినప్పుడు అతడితో తమన్నా డేటింగ్ చేస్తోందని.. అందుకే వరుసగా భారీ సినిమాల డీల్ కుదిరిందని తమిళ మీడియాలో కథనాలు వేడెక్కించాయి.ఆ తర్వాత అది నిజం కాదని తేలింది. కొన్నాళ్ల తర్వాత పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో కలిసి ఉన్న ఫోటో అంతర్జాలంలో వైరల్ అయ్యింది. దాంతో తమన్నా సదరు క్రికెటర్ తో జోరుగా షికార్లు చేస్తోందని కోలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. అయితే ఓ వాణిజ్య ప్రకటనలో సదరు క్రికెటర్ తో నటించానని దుబాయ్ లో ఉన్నప్పుడు దిగిన ఫోటో అది అని తమన్నా వివరణ ఇచ్చింది. అసలు ఈ ఎఫైర్ గోలేంటి? అంటూ చికాకు పడింది. 2017 ఇన్సిడెంట్ ఇది. ఆ తర్వాత కూడా ఓ టాప్ క్లాస్ బిజినెస్ మేన్ తో తమన్నా డేటింగ్ చేస్తోందన్న పుకార్లు షికారు చేశాయి. కానీ వాటిని కూడా తమన్నా ఖండించింది.

ప్రస్తుత స్టాటస్ ఏమిటి? అంటే తమన్నా ఇంకా సింగిలేనట. క్రికెటర్ తో కానీ బిజినెస్ మేన్ తో కానీ ఎఫైర్ ఏదీ లేదు. ప్రేమా దోమా ఏదీ లేదని క్లారిటీనిచ్చేసింది. మరో రెండేళ్ల వరకూ అంటే 2022 వరకూ పెళ్లి మాటే ఎత్తదట. ప్రస్తుతం పూర్తిగా కెరీర్ పైనే దృష్టి సారించానని ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అయితే పెళ్లికి సిద్ధమైతే వరుడు ఎలా ఉండాలి? అన్నది అభిమానుల డౌట్. అతడు క్రికెటరై ఉండాలా? లేక బిజినెస్ మేన్ అయితే సరిపోతుందా? అంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ సరసన సీటీమార్ లో నటిస్తోంది. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. అటు తమిళంలోనూ పలు చిత్రాలతో బిజీగా ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments