ఏపీ సీఎం జగన్.. వైఎస్ఆర్ చేయూత పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవాళ జరగబోయే ఏపీ మంత్రివర్గ భేటిలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ పధకం ద్వారా 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.19 లక్షల మంది మహిళలు ఈ పధకం ద్వారా లబ్ది పొందనుండగా.. దీని అమలుకు ఏపీ ప్రభుత్వం ఒక్కో ఏడాదికి రూ.4,535.70 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.18,142.8 కోట్లను ఖర్చు చేయనుంది. కాగా, అధికారిక వర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45-60 ఏళ్లు కలిగిన మహిళలు ఎస్సీలలో 5.89 లక్షల మంది, ఎస్టీలలో 1.63 లక్షల మంది, బీసీల్లో 15.26 లక్షల మంది, మైనార్టీ లలో 1.40 లక్షల మంది ఉన్నట్లు తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments