జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి – బాలయ్య కుటుంబానికి చాలా దూరం. అయితే ఎన్టీఆర్ పెళ్లి విషయంలో బాలయ్య ఫ్యామిలీ ఎన్టీఆర్ ని కలుపుకున్నప్పటికీ.. మళ్ళీ ఎన్టీఆర్ ని దూరంగానే పెట్టాడు బాలయ్య. బాలయ్య కి ఎన్టీఆర్ కి మధ్యన పొంతన లేదనేది జగమెరిగిన సత్యమే. అయితే హరికృష్ణ మరణంతో బాలయ్య మళ్ళీ ఎన్టీఆర్ ని దగ్గరకి తీయడం, ఎన్టీఆర్ కూడా బాలయ్య కి దగ్గరైనట్టుగా కనిపించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండా బాలయ్య అడ్డం పడుతున్నాడని.. అల్లుడు లోకేష్ కోసం ఎన్టీఆర్ ని బాలయ్య దూరం చేస్తున్నాడని ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతుంటారు.

తాజాగా ఎన్టీఆర్ బాలయ్యకి ఆత్మీయ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం మాత్రం సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయింది. ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ ని పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. నా లోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే బాబాయ్ . జై బాలయ్య అంటూ ట్వీట్ చేసాడు. ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ బాలయ్యకి విషెస్ చెప్పడం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్తేజం మొలకెత్తేలా చేసింది. ఇక 60 వ పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య షష్టిపూర్తి వేడుకలకి సిద్దమయ్యాడు. అయితే ఈ వేడుకలకి ఎన్టీఆర్ కూడా హాజరవుతాడని తెలుస్తుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments