ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ టోర్నీని.. అవసరమైతే ఖాళీ స్టేడియాల్లోనూ నిర్వహించే అవకాశం ఉందన్నారు. కోవిడ్‌19 వల్ల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ .. నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కానీ ఆ మెగా టోర్నీని ఈ ఏడాది నిర్వహించేందుకు విశ్వాసంగా ఉన్నట్లు గంగూలీ తెలిపారు. టోర్నీ నిర్వహణకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఐసీసీ బోర్డు మీటింగ్‌ తర్వాత ఈ అంశంపై బుధవారం రాత్రి అన్ని సంఘాలకు గంగూలీ లేఖ రాశారు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఐపీఎల్‌ను నిర్వహించే ఆసక్తితో గంగూలీ ఉన్నట్లు ఆ లేఖ ద్వారా తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments