మల్కాజిగిరిలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా మరో ఐదు కరోనా కేసులు నమోదు అయ్యాయి. నేరేడ్మెంట్ ప్రాంతాలలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మల్కాజిగిరి నేరేడ్మెట్ ప్రాంతాలలో ఐదు కేసులు రిపోర్టు అయ్యాయి. నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలో మూడు కేసులు, జేజేనగర్లో ఒకటి, ఓల్డ్ మల్కాజిగిరిలో మరోకేసు నమోదు అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం మాత్రం తగిన చర్యలు తీసుకుకోకపోవడం గమనార్హం. లాక్ డౌన్ సడలింపుల అనంతరం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం కరోనా టెస్టులు చేయకపోవడం, రోగులకు సరైన చికిత్స అందించకపోవడం విచారకరం.
మల్కాజిగిరిలో భారీగా పెరిగిన కరోనా కేసులు
Subscribe
Login
0 Comments