తన పుట్టినరోజు సందర్భంగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ స్పందించారు. కాకపోతే పాజిటివ్ గా కాదు. నందమూరి అభిమానులకు కాస్త నిరాశ కలిగించేలానే బాలకృష్ణ రియాక్షన్ ఉంది. ఇంతకీ మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఏమన్నారంటే..

“దేనికైనా కలిసిరావాలి. నేను విధిని నమ్ముతాను. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు జరగాలని ఉందో అప్పుడే జరుగుతుంది. అయితే ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఇప్పట్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండదు. వచ్చే ఏడాది కూడా మోక్షజ్ఞ రాడు. కాకపోతే వాడి కోసం బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ రెడీ చేయించి పెట్టాను. సినిమాల్లోకి వస్తే వాడి తొలి సినిమా నేను తయారుచేయించిన కథతోనే ఉంటుంది.”

ఇలా కొడుకు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు బాలకృష్ణ. మరోవైపు హీరోగా మారడం కోసం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ భారీగా కష్టపడుతున్నాడని, మేకోవర్ అయ్యాడని, బరువు తగ్గాడని రకరకాలుగా వచ్చిన వార్తలు ఇవాళ్టితో అబద్ధమని తేలిపోయాయి. బాలయ్య కేక్ కటింగ్ సందర్భంగా మోక్షజ్ఞ కూడా కనిపించాడు. అదే పొట్ట. అదే బరువు.. సేమ్ అలానే ఉన్నాడు. కొత్తగా ఎలాంటి మేకోవర్ కనిపించలేదు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments