బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయుష్మాన్‌ ఖురానా, దీపికా పదుకొణె, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, కార్తిక్‌ ఆర్యన్‌, భూమి పెడ్నేకర్‌కు ఛాలెంజ్‌ విసిరారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గులాబో సితాబో’. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో పాత హవేలీ యజమాని మీర్జా షేక్‌గా అమితాబ్‌, ఆయన ఇంట్లో అద్దెకు ఉంటే వ్యక్తి బాంకీ సోధిగా ఆయుష్మాన్ కనిపించనున్నారు. ఈ సినిమా జూన్‌ 12న నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది.

ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అమితాబ్‌ తాజాగా ఓ వీడియోను షేర్‌ చేశారు. అందులో ఓ పెద్ద హిందీ డైలాగ్‌ను తడబడకుండా ఐదుసార్లు చెప్పారు. ఈ ‘టంగ్‌ ట్విస్టర్‌’ను ఐదు సార్లు చెప్పాలంటూ విరాట్‌, దీపిక, రణ్‌బీర్‌, భూమి తదితరుల్ని నామినేట్‌ చేశారు. దీనికి భూమి స్పందిస్తూ.. ‘ఇది చాలా కష్టమైన పని’ అని కామెంట్‌ చేశారు.

ఆయుష్మాన్‌ సవాలు స్వీకరించి.. డైలాగ్‌ గడగడా చెప్పేశారు. తనవంతుగా వరుణ్‌ధావన్‌, కరణ్‌ జోహార్‌, అర్జున్‌ కపూర్, తాప్సి తదితరుల్ని నామినేట్‌ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments