కరోనా లాక్డౌన్లో నిలిచిన శ్రీవారి దర్శనం 80 రోజుల తర్వాత ప్రారంభమైంది. ఈరోజు ఉదయం నుంచి శ్రీవారి దర్శనాన్ని టీటీడీ పున:ప్రారంభించింది. మూడు రోజుల పాటు ట్రైల్ రన్ క్రింద ఉద్యోగులు, తిరుమల స్థానికులను టీటీడీ దర్శనానికి అనుమతించనుంది. నేటి దర్శనం కోసం ఇప్పటికే 5500 టైం స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేసింది. శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది. వైభవోత్సవ మండపంలో జరిగే ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సుదీర్ఘ విరామం అనంతరం దర్శనాన్ని ప్రారంభిస్తుండడంతో శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పలతో సర్వాంగ సుందరంగా అలకరించారు. ఉదయం 9 గంటల నుంచి ట్రైల్రన్ క్రింద టీటీడీ ఉద్యోగులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
నేటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం
Subscribe
Login
0 Comments