జగన్ ప్రభుత్వానికి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ అభినందనలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏడాది పాలనలో అమలు చేశారని…అన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం గత ప్రభుత్వంలో చేయలేకపోయాకమని… ప్రాజెక్టు నిర్మాణంపై గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఓటమిపై ఇప్పటికైనా సమీక్షించుకోవాలని సూచించారు. వైసీపీ పాలనపై చంద్రబాబు విమర్శించినా…. ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజకీయాల్లో ప్రస్తుతం ఎథిక్స్ లేవని… నాయకులు నియోజకవర్గం అభివృద్ధి మాత్రమే చూసుకుంటున్నారని ఎమ్మెల్యే కరణం బలరామ్ వ్యాఖ్యానించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments