పలాస 1978 సినిమాతో విమర్శకుల ప్రశంశలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. థియేటర్లతో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. కరుణ కుమార్ తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ వచ్చింది. రాజశేఖర్ హీరోగా జీవిత నిర్మాణంలో కరుణ కుమార్ మూవీ ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్న్నాయని తెలుస్తుంది. మొదటి సినిమా తరహాలోనే రాజశేఖర్ తో కూడా పీరియాడిక్ నేపథ్యంలో సినిమాను రూపొందించబోతున్నాడట. వచ్చే నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ సినిమాలో రాజశేఖర్ విభిన్న పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇటీవల గరుడ వేగ సినిమాతో హిట్ అందుకున్న రాజశేఖర్ ఆతర్వాత కల్కి అనే సినిమా చేశారు. ఈ సినిమా పర్లేదు అనిపించింది. ఇక ఈసినిమాతో మరో హాట్ అందుకోవాలని అటు రాజశేఖర్ , ఇటు దర్శకుడు కరణ్ కుమార్ చూస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments