జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఆచి తూచి అడుగేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జనసేన పార్టీ కి లాభదాయకంగా మారనుందని తెలుస్తుంది. మూడు రాజధానుల ప్రతిపాదన తో వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రతిపాదనకు మాత్రమే కాకుండా విశాఖ ని పరిపాలన రాజధానిగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారని అర్ధం అవుతుంది.

అయితే ఇప్పటికే పవన్ అమరావతి లో పర్యటించి రాజధాని ప్రజల, రైతుల మనోభావాలు, ఆలోచనలు, సమస్యలు, అన్ని తెలుసుకున్నారు. అయితే ఇతర ప్రాంతాలకు వ్యతిరేక నినాదాలు చేయకుండా, అమరావతి ప్రాంత రైతులకు న్యాయం జరిగేలా చేసేందుకు తగు ప్రణాళికలు రచించడం మాత్రమే కాకుండా, వైసీపీ ప్రభుత్వం తీసుకొనే కొన్ని నిర్ణయాలకు ముందుగానే అటాకింగ్ ప్లాన్ ని తయారు చేసినట్లు తెలుస్తుంది. నిరసనలు, ధర్నాలతో పవన్ ఇక బిజీ గా గడపనున్నారు. అయితే మార్చ్ వరకు పవన్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రణాళిక అమలు పరచనున్నాడు. మరి అమరావతి విషయం లో పవన్ రైతులకు ఎంతవరకు న్యాయం చేయగలరో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments