వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీలో పెద్ద విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బోని కపూర్, దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రెండున్నర ఏళ్ల తరువాత టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారు పవన్. కాగా తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతి లభించిన నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో హైలెట్ ఇవేనంటూ ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలోని కోర్టు సన్నివేశాలు, డైలాగ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతీ హాసన్‌ నటిస్తోంది. అంజలి, నివేథా థామస్‌, అనన్య, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కుదిరితే అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీపై పవన్‌ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments