దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోడీ లాక్ డౌన్ అమలు చేసారు. అయితే దేశ ఆర్తిక వ్యవస్థ నష్టాల్లో పడుతున్న కారణంగా వైరస్ తో కలిసి జీవించాలనే నినాదం తీసుకువచ్చి లాక్ డౌన్ లో సడలింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రాల్లో ఒక్కో వ్యవస్థ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రవాణా వ్యవస్థను కూడా తిరిగి ప్రారంభిస్తూ దాదాపు అని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ తిరిగి ఆర్టీసీ సేవలను ప్రారంభించారు. అయితే అంతరాష్ట్ర బస్సు సర్వీస్ లపై తెలంగాణ కు APSRTC అధికారులు లేఖ రాసారు. అంతరాష్ట్ర బస్సు సర్వీస్ నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని…. మీరు కూడా ఏపీకి బస్సులు నడపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై మంత్రి పువ్వాడ అజయ్ స్పందిస్తూ… అంతరాష్ట్ర, సిటీ బస్సులు నడిపేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గిన తర్వాతే సిటీ బస్సులు నడుపుతామని క్లారిటీ ఇచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments