నిలకడగా శశి ప్రీతమ్ ఆరోగ్యం
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది . ఆయనను ఆసుపత్రిలో చేరారు. ఈయన చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ .. తెలుగులో సినిమాలతో పాటు పలు సీరియల్స్‌కు కూడా ఈయన మ్యూజిక్ అందించారు . కృష్ణ వంశీ తెరకెక్కించిన గులాబీ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆతర్వాత సింధూరం , హ్యాండ్స్ అప్ ఇలా పలు సినిమాలకు సంగీతం అందించారు . హిందీసినిమాలకు కూడా అయన మ్యూజిక్ అందించారు.

గురువారం ఆయన కు గుండె పోటు రావడంతో ఆయనను బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే గుండెకు స్టంట్స్ వేసారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆర్యోగ్యం నిలకడగా ఉందని… రేపు లేదా ఎల్లుండి ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని సమాచారం .

శశి ప్రీతమ్ గారు తొందరగా కోలుకోని మనకి మరన్ని మంచి మంచిపాటలతో అలరిస్తారని ఆశిద్దాం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments