దేశంలో గడిచిన 24 గంటల్లోనే 9,887 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 294 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,36,657 కు చేరింది.
దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,15,942 కు చేరింది. కాగా ఈ వైరస్ బారినుంచి 1,14,073 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,642 కు చేరింది. అత్యధిక కరోనా కేసులు నమోదైన 6వ దేశంగా భారత్ అవతరించింది.