ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దెబ్బకి తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా కుదేలైపోయింది. ఇండస్ట్రీలోని చిన్న పనులు చేసుకునే వారు ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు. రోజు వారీ కూలీ లేకపోవడంతో వారి జీవితాలపై కరోనా ప్రభావం ఇంకా ఎక్కువుంది. హీరోలు హీరోయిన్లకు సినిమాలే కాకుండా ప్రకటనల ద్వారా డబ్బులు బాగానే సంపాదించుకున్నారు కాబట్టి వారి పై దీని ప్రభావం ఇప్పటి వరకైతే పెద్దగా లేదు అనే చెప్పాలి .

అయితే ఇండస్ట్రీలోని చిన్న చిన్న పనులు చేసుకునే వారికీ ఆర్థిక సహాయం అందించటం కోసం చిరంజీవి ఇప్పటికే కరోనా క్రైసిస్ పేరున చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టి వారికీ ఆర్థిక సహాయమే కాకుండా ఆహారం కూడా అందిస్తున్నారు.

ఇండస్ట్రీ మళ్ళీ తిరిగి పనులు ప్రారంభించేలా చిరు కృషి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే చర్చలు కూడా జరిపారు ఈ విషయంపైనే. అయితే కెసిఆర్ ఇప్పటికే ఇండస్ట్రీకి పనులు తిరిగి ప్రారంభించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు జగన్ కూడా చిరు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అయితే ప్రభుత్వాలు ఒకే చెప్పినా కూడా పనులు తిరిగి ప్రారంభించినా సరే ఇప్పటికే సినిమా థియేటర్లు మూత బడటంతో అందరిని ఒక ప్రశ్న కలచివేస్తుంది. అసలు ప్రేక్షకులు ఈ కరోనా భయంతో సినిమా హాళ్లకు వస్తారా అని. ఒకవేళ మనం సినిమా షూటింగ్ చేసి, రిలీజ్ చేసిన అనుకున్నంత లాభాలు వస్తాయా అని ఇండస్ట్రీ పెద్దలు భయపడుతున్నారు.

పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు కానీ సినిమా రిలీజ్ కి మాత్రం జంకుతున్నారట. అందుకే చిరంజీవి దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మొదట నా సినిమానే రిలీజ్ చేసుకుంటాను. మీకు ఆ భయం అక్కర్లేదు అని చెప్పారట. ఆ రిస్క్ నేనే తీసుకుంటాను అని మాటిచ్చారని తెలుస్తుంది.

అన్నిట్లో ముందుండి నడిపిస్తున్న చిరుకి ఇదొక సవాల్ అని చెప్పొచ్చు. కానీ ఈ సవాల్ ని స్వీకరించిన చిరుకి కచ్చితంగా హాట్సాఫ్

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments