టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్స్‌లో శేఖర్ మాస్టర్ ఒకరు. బడా హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న ఆయన రీసెంట్‌గా అల వైకుంఠపురములోని రాములా..రాములా అనే సాంగ్‌కి కొరియోగ్రఫీ చేశారు. ఇందులో బన్నీ వేసిన స్టెప్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున తనయ అర్హ ఇందులోని ఓ స్టెప్‌ని దోశె స్టెప్‌గా అభివర్ణించడం మనం చూశాం.

తాజాగా రాములో రాములా సాంగ్‌కి శేఖర్ మాస్టర్ ఆయన తనయుడు విన్నీతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందులో ఇద్దరు పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. వీరిద్దరి డ్యాన్స్ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. శేఖర్ మాస్టర్ గతంలో స్వింగ్ జరా( జై లవకుశ), వచ్చిందే (ఫిదా), అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు (ఖైదీ నెం 150), దిమాగ్ ఖరాబ్ ( ఇస్మార్ట్ శంకర్‌) వంటి సాంగ్స్‌కి కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు విన్నీ కూడా తన డ్యాన్స్‌లతోనే కాక నటనతోను ఆకట్టుకుంటున్నాడు. లాక్‌డౌన్ సమయంలో విన్నీ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments