మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ 4.0 ముగియనుంది. ఈ తరుణంలో కేంద్రం మరోసారి లాక్ డౌన్‌ను పోడిగిస్తుందంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్‌ను పొడిగిద్దామా.? వద్దా.? అనే విషయాలపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సుమారు 11 నగరాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0ను అమలు చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ.. రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతానికి లాక్ డౌన్ 5.0 విషయంపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు మరో వారం లేదా పది రోజుల సమయం పడుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే అమిత్ షా లాక్ డౌన్ విషయంపై రాష్ట్రాల సీఎంల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. కేంద్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేంద్రం లాక్ డౌన్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలేస్తుందని తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments