కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్ దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శన అనంతరం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.. కేసీఆర్కు జ్ఞాపికను అందజేశారు. ఆలయ ఆవరణలో గోమాతను పూజించి.. పూలమాల వేసి, అరటిపండు తినిపించారు. అనంతరం అర్చకులు ఆశీర్వాదం సీఎం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, సంతోష్ కుమార్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.
కొండపోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
Subscribe
Login
0 Comments